విరాట్ కొహ్లీ సంగతి తెలిసేందేగా ఏదీ ఓ పట్టాన దాచుకోడు. ఎవరిది వాళ్లకి తిరిగి ఇచ్చేస్తాడు అంతే. ఈ ఐపీఎల్ కాంతార సెలబ్రేషన్ ను ఫేమస్ చేశాడు కేఎల్ రాహుల్. తనను ఆర్సీబీ జట్టులోకి తీసుకోలేదనే కోపంతోనో ఏమో...ఏప్రిల్ 10న జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీని బెంగుళూరు చిన్నస్వామిస్టేడియంలో ఓడించి కాంతార సెలబ్రేషన్ చేశాడు కేఎల్ రాహుల్. బ్యాట్ లో నేలలో దింపుతూ.. ఈ నేల నాది చిన్నప్పటి నుంచి ఇదే పిచ్ పై ఆడి పెరిగినవాడిని కనుక దీనిపై మొత్తం హక్కు అంతా తనకే ఉందంటూ రాహుల్ రీ క్రియేట్ చేసిన కాంతారా సీన్ ఆరోజు సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే ఆ రోజు సైలెంట్ అయిపోయిన ఆర్సీబీ అండ్ విరాట్ కొహ్లీ నిన్న ఢిల్లీతో ఢిల్లీలోనే జరిగిన మ్యాచ్ లోనే రివెంజ్ తీర్చుకున్నాడు. ఢిల్లీ విసిరిన 163పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయినా కంగారు పడకుండా నిబ్బరంగా ఆడాడు విరాట్ కొహ్లీ. కృనాల్ పాండ్యాకు ఎక్కువ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఈ సీజన్ లో ఆరో హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఆరెంజ్ క్యాప్ ను అందుకున్నాడు. అయితే టార్గెట్ ఫినిష్ చేయటానికి కొంచెం ముందుగా విరాట్ కొహ్లీ అవుటయ్యాడు. కానీ పాండ్యా, టిమ్ డేవిడ్ కలిసి మ్యాచ్ ముగించేసిన తర్వాత మళ్లీ గ్రౌండ్ లోకి వచ్చిన కొహ్లీ కేఎల్ రాహుల్ దగ్గరకు వెళ్లి కాంతారా సెలబ్రేషన్ చేసి చూపించాడు. ఈ గ్రౌండ్ నాదిరా రాహుల్ అంటూ సరదాగా కేఎల్ రాహుల్ ను హగ్ చేసుకుని టీజ్ చేశాడు కొహ్లీ. మ్యాచ్ ఓడిపోయిన చిరు కోపంలో ఉన్న రాహుల్ కూడా సిగ్గుపడుతూ కనిపించాడు. ఆట కోసం తాపత్రయ పడటం..విపరీతంగా గేమ్ ను ఎంజాయ్ చేసే కొహ్లీ నేచర్ ను ఈ సీన్ వివరిస్తోందంటున్నారు కింగ్ కొహ్లీ ఫ్యాన్స్.